శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (20:40 IST)

జామియా మసీదు అభివృద్ధికి సంపూర్ణ సహకారం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం వున్న మందడం జామియా మసీదును అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం ప్రభుత్వం తరపున అందజేయటం జరుగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి , మైనారిటీ శాఖా మంత్రి బేపారి అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం జుమా నమాజుకోసం అయన కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హాఫిజ్ ఖాన్ తో కలిసి సచివాలయం సమీపంలోని మందడం జామియా మసీదుకు వచ్చారు. 
 
శుక్రవారం ప్రార్ధనల అనంతరం అయన మసీదు పెద్దలను కలిశారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అంజాద్ బాషాను కలిసి తమ విన్నపాలను అందించారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలు తమకష్టాలు చెప్పుకునేందుకు ఇప్పటివరకు ఒక బాధ్యుడు వుండేవాడు కాదని, తాము మైనారిటీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా వున్న ముస్లింల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారన్నారు. 
 
ఆ మేరకు మైనారిటీల అవసరాలను గుర్తిస్తూ ప్రస్తుత బడ్జెట్లో మైనారిటీల అభివృద్ధికి భారీ కేటాయింపులు జరిగాయన్నారు. తద్వారా మైనారిటీల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు చూడాలనుకుంటుందన్నారు . ఈ క్రమంలో మసీదులు దర్గాలు, కబ్రిస్థాన్లు అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న వక్ఫ్ ఆస్తులను గుర్తించి వాటిని స్వాదీనం చేస్కుంటామన్నారు. అన్నీ ఆస్తులను మళ్ళి కేవలం మైనారిటీల అభ్యున్నతికే ఖర్చుచేస్తామన్నారు.
 
మైనారీలు జగనన్నకు బాసటగా నిలవడంవల్లే ఐదుగురు ముస్లిం అభ్యర్థులలో తాము 4 గెలిచామన్నారు. జగనన్న ఏకంగా డెప్యూటీ సీఎం పదవిని తనకు ఇవ్వడంవల్ల మైనారిటీల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందన్నారు. మైనారిటీలు అందించిన సహకారానికి బదులుగా ప్రతివక్కరికి ప్రభుత్వం చేయూతనిస్తున్నారు .