సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (15:14 IST)

జగన్ మాయా ప్రభుత్వంలో వికృత రాజకీయం : నారా లోకేశ్

రైతుల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ, అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలు అని తేల్చారు. అదే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలని తేల్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలుమాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.