శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:33 IST)

కడప జిల్లాలో చిచ్చు పెట్టిన ఎన్నికలు.. పాఠశాలకు వెళ్లని విద్యార్థులు

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు వాయిదా వేయటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా పాఠశాలను బహిష్కరించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జా ఖాన్ పల్లె లో పాఠశాల బహిష్కరణకు దారి తీసింది సజావుగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు వస్తారని లేదంటే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరగ్గా సకాలంలో తల్లిదండ్రులు రాలేదని పాఠశాల ఉపాధ్యాయురాలు శివకాశి నోటీసు బోర్డు అంటించి ఎన్నిక వాయిదా వేశారు.

పాఠశాలకు వెళ్లినా ఎన్నిక రద్దు చేయటం ఏంటని ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా, బహిష్కరించారు.

ఈ ఎన్నికల పంతం విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని ప్రశ్నిస్తే, సక్రమంగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు పంపిస్తామనీ లేదంటే పంపే ప్రశక్తే లేదని తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెప్తున్నారు.