శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (21:25 IST)

త్వరలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్-డిసెంబర్ మధ్య ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది.

ఈ వారం చివరి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఇందుకు సంబంధించి సీఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముందుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగిసిన తర్వాత జార్ఖండ్‌లో పోలింగ్ చేపట్టనున్నారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు 2014 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 15న పోలింగ్ నిర్వహించి 19న ఫలితాలు ప్రకటించారు. జార్ఖండ్‌ అసెంబ్లీకి కూడా 2014 డిసెంబర్‌లో 5 దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

హర్యానా, మహారాష్ట్రలకు దీపావళి కంటే ముందే పోలింగ్ పూర్తి చేస్తారని సమాచారం. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్-డిసెంబర్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.