శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జులై 2019 (20:54 IST)

పక్క రాష్ట్రాలకూ సహకారం అందిస్తాం... విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

తెలంగాణ పోలీస్ కే కాదు, పక్క రాష్ట్రాలకూ సహకారం అందిస్తామని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ సందర్భముగా శనివారం విజయవాడ నగర కమిషనరేట్ లో అర్ధ వార్షిక సమీక్ష నిర్వహించారు. నగరవాసులకు మెరుగైన సేవలు అందించడంపై సమీక్షించామని అన్నారు.

ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ, జైళ్లు, రోడ్లు, భవనాల శాఖ వంటి పలు శాఖలతో సమీక్షించామని చెప్పారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్పందన కార్యక్రమంపై విస్తృతంగా చర్చించామని అన్నారు. సమస్యల పరిష్కారం దిశగా అన్ని శాఖల అధికారులు చర్చించారని, ఇప్పటి వరకు నాలుగు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ సమీక్షకు న్యాయాధికారులు, కలెక్టర్, వీఎంసీ కమిషనర్ హాజరయ్యారు.