గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జులై 2019 (19:56 IST)

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గ‌మ్మ‌... ఆషాఢంలో సారె స‌మ‌ర్పిస్తున్న భ‌క్తులు...

ఆషాడ మాసం సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు సారె స‌మ‌ర్పిస్తున్న భ‌క్తులతో శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ప‌రిస‌ర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతున్నాయి. భ‌క్తులు వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా త‌ర‌లివ‌చ్చి అమ్మ‌కు సారె స‌మ‌ర్పిస్తున్నారు. విద్యాధ‌ర‌పురం కామ‌కోటిన‌గ‌ర్‌లోని గోరెంట్ల రెసిడెన్సీ నుంచి వి.జయలక్ష్మి బృందం సుమారు 30 మంది మ‌హిళ‌లు శ‌నివారం ఉద‌యం దుర్గ‌మ్మ‌ను ద‌ర్శ‌నం చేసుకుని అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు. 
 
ప‌సుపు, కుంకుమ‌, పండ్లు ప‌ళ్లాల్లో అందంగా అలంక‌రించి ఇంద్ర‌కీలాద్రిపై మహామండపంలోని ఆర‌వ అంతస్థులో ఉన్న అమ్మవారికి ప‌విత్ర సారే సమర్పించారు. గ‌తేడాది కూడా వీరంతా అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు. అదేవిధంగా పలు ప్రాంతాలకు చెందిన 18 బృందాలు దాదాపు 900 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనము చేసుకుని పవిత్ర సారే సమర్పించారు. సారే సమర్పించు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగ‌డంతో సారే సమర్పించు బృందములవారికి చేసిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షిస్తు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చర్యలు చేపడుతున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం విజయవాడలోని పులిపాటి వారి వీది నుండి ఎం.శివపార్వతి దేవి వారి బృందం(150 మంది), కృష్ణలంక నుండి అపరాజిత గ్రూప్ వారు (130 మంది), వ‌న్‌టౌన్ నెహ్రు బొమ్మ సెంటర్ నుండి క్రాంతి మల్లేశ్వర రావు(100 మంది), పెనుగ్రంచిప్రోలు నుండి విశ్వబ్రాహ్మణ మహిళా పరిరక్షణ సమితి వారు(75 మంది), విజయవాడ కస్తూరిబాయి పేట నుండి ఎం.రాజరాజేశ్వరీ బృందం(70 మంది), గుంటూరు విద్యానగర్ నుండి గుంటూరు సాయి సేవా సంఘం వారు (70 మంది), పూర్ణానందపేట నుండి శ్రీ కౌశల్య సీతారామ భజన భక్త మండలి (60 మంది సభ్యులు), నూజివీడు రావిచెర్ల నుండి సీతారామ భజన మండలి(50 మంది సభ్యులు), విజయవాడ విశాలాంద్ర రోడ్  ముత్యాలమ్మ తల్లి బృందం (35 మంది), భవానిపురం నుండి కూల్ కపుల్స్ కిట్టి బృందం(25 మంది),  కామకోటినగర్‌లోని గోరెంట్ల రెసిడెన్సీ నుండి వి.జయలక్ష్మి వారి బృందం (21 మంది), మొగల్రాజపురం నుండి దేవస్థాన పర్యవేక్షణాధికారి చందు శ్రీనివాస్ వారి బృందం(20 మంది), ఆటో నగర్ నుండి శ్రీనందనందన కోలాట భజన బృందం(20 మంది), వ‌న్‌టౌన్ నుండి వి.గీత వారి బృందం(20 మంది), తాడిగడపలోని శ్రీ విఘ్నేశ్వర రెసిడెన్సీ నుండి జె.నారాయణ రావు  బృందం (20 మంది) మరియు ఇతరులు అమ్మవారికి సారే సమర్పించారు. 
 
వీరు అమ్మవారి దర్శనం చేసుకుని, మహామండపము 6వ అంతస్తులోని అమ్మవారి ఉత్సవమూర్తి దగ్గర పూజలు నిర్వహించి సారే సమర్పించారు. సారే సమర్పించిన భక్తులందరికీ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు పంపిణీ చేశారు.