శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జులై 2019 (19:18 IST)

తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదు.. టిటిడి

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం కానీ, వినియోగించడం కానీ చేయరాదని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్త్రతంగా ప్రచారం చేపడుతోంది.
 
నిషేధిత వస్తువుల్లో మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు, మాంసం, ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి. తిరుమలలో జూదం ఆడడంతోపాటు పెంపుడు జంతువులను, పక్షులను ఉంచుకోవడం చేయరాదు. 
 
లైసెన్సు గల ఆయుధాలు ఉన్న పక్షంలో సమీప పోలీస్‌ స్టేషన్‌లో వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్పగించాల్సి ఉంటుంది. నిషేధిత వస్తువులను కలిగి ఉన్న పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టిటిడి భక్తులను కోరుతోంది.