శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (15:30 IST)

దోపిడీ మిస్టరీని ఛేదించిన పోలీసులు... సిబ్బందికి రివార్డులు

ప్రగతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో దోపిడీ మిస్టరీని తమ పోలీసులు ఛేదించారని డీసీపీ విజయరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు. పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ను సంతోష్ త్రిపాఠితో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు. 
 
వర్కింగ్ పార్టనర్‌గా ఉన్న వేణుగోపాల్ విభేదాలతో బయటకు వచ్చాడు. సంస్థలో జరిగిన‌ నష్టాన్ని ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు. వదిన కుమారుడు విశాల్‌కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్‌కు సూచనలు చేశాడు. విశాల్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఈ కేసు మిస్టరీ‍ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం డీసీపీ విజయరావు వెల్లడించారు.