శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (13:19 IST)

దుర్గమ్మకు ఆషాఢ మాసం సారె.. ఉండవల్లివాసుల ప్రదానం

ఉండవల్లి గ్రామ మహిళలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢం సారె అత్యంత వైభవోపేతంగా తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాలతో పూలు, పండ్లు, సారె, గాజులు తీసుకొని సంబరంగా తరలివెళ్లారు. గత ఏడాది సైతం ఇదే మాదిరిగా అమ్మవారికి సారె తీసుకెళ్లామని అలాగే ప్రస్తుతం కూడా తీసుకెళ్తున్నామని సారె తీసుకెళ్తున్న భక్తులు పేర్కొన్నారు. 
 
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా వుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండి, ప్రాజెక్టులన్ని జలంతో కళకళలాడాలని వారు ఆకాంక్షించారు. ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజారు రామ మందిరంలో పూజలు చేసిన అనంతరం అమ్మవారికి సారే తీసుకొని మేల తాళ్లాలతో, తప్పట్ల నడుమ మహిళలు నడుచుకుంటూ బయల్దేరి వెళ్లారు.