శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (12:27 IST)

24న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నరుగా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 
 
ఇందుకోసం ఆయన ఈ నెల 23వ తేదీన భువనేశ్వర్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. పిమ్మట విజయవాడకు చేరుకుంటారు. 
 
విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తూ వచ్చిన భవనాన్ని రాజ్‌భవన్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీచేసింది. 
 
భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.