సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (11:10 IST)

తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని కాదు...

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై వైకాపా నేత, సినీ నిర్మాత, పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ మండిపడ్డారు. తనను ఉద్దేశించి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు పీవీపీ కౌంటరిచ్చారు. 
 
తాను ఎవరికైనా బాకీ ఉంటే వడ్డీతో సహా చెల్లిస్తాననీ, అయితే అంతకుముందు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి అప్పులు చెల్లించాలంటూ పీవీపీని ఉద్దేశించి కేశినేని నాని ఇటీవల ట్వీట్ చేశారు. 
 
దీనికి పీవీపీ కౌంటరిచ్చారు. "తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ "గురువు"గారిని  అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.