శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (08:25 IST)

పరిశ్రమల శాఖ మంత్రితో ఆ సంస్థల ప్రతినిధుల భేటీ.. ఎందుకో తెలుసా?

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పలు సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో బుధవారం సెల్ కాన్, కార్బన్ వంటి మొబైల్ ఫోన్ కంపెనీల బృందంతో భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేయబోయే అభివృద్ధిలో  తమ వంతు భాగస్వామ్యానికి సిద్ధమని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ పాల్గొన్నారు.
 
'ఫస్ట్ అమెరికా ఇండియా' ప్రతినిధుల బృందం భేటీ
 బుధవారం మధ్యాహ్నం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఫస్ట్ అమెరికా ఇండియా ప్రతినిధులు  కలిశారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేస్తున్న వినూత్న ఆలోచనలను ఫస్ట్ అమెరికా ప్రతినిధి బృందం కొనియాడింది. పారదర్శక విధానమే నినాదంగా ముందుకెళుతోన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి  వారు సిద్ధంగా ఉన్నామన్నారు.