ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగుల ఆర్టీజీఎస్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) వెల్లడించింది. ముఖ్యంగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ఇదే అంశంపై ఆర్జీటీఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పలు మండలాల్లో పిడుగుల వర్షం కురవనుంది. రాగల 40 నిమిషాల్లో ఈ రెండు జిల్లాలలో పిడుగులు పడనున్నాయని పేర్కొంది.
విశాఖ పట్నం జిల్లాలోని పెద్దబయలు, ముంచింగిపుట్టు, నర్శీపట్నం, ప్రకాశం జిల్లాలో బేస్తవారిపేట, రాచర్ల, తర్లుపాడు, అర్ధవీడు, గిద్దలూరు, హనుమంతుని పాడు, వెలంగండ్ల, కృష్ణా జిల్లాలో తిరువూరు, విసన్నపేట, చాట్రాయి, గోపాలగూడెం, ఏ కొండూరు, రెడ్డి గూడెం, నూజివీడు, ముసునూరు, బాపుల పాడు, ఆగిరిపల్లి, జి కొండూరు, మైలవరం, ఉంగటూరు, విజయవాడ అర్బన్, రూరల్ , పెనమలూరు, గన్నవరం మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అందువల్లఈ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి బయట ప్రాంతాల్లో సంచరించరాదని, చెట్ల కింద ఉండటం ప్రమాదకరని ఆర్టీజీఎస్ విజ్ఞప్తి చేసింది.