బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:39 IST)

భారత విద్యార్థులకు బ్రిటన్ బంపరాఫర్

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ శుభవార్తనందించింది. 2012 లో రద్దుచేసిన పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాను తిరిగి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యనభ్య సించిన తర్వాత రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉద్యోగం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ వీసాను 2020-21 నుంచి అమలు చేయనున్నట్లు బ్రిటన్‌ తెలియజేసింది.

బ్రిటన్‌ మాజీ ప్రధాని థెరిసా మే హోం సెక్రటరీగా ఉన్నప్పుడు (2012లో) రెండేళ్ల పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాలను రద్దు చేశారు. వివిధ దేశాల ప్రతిభావం తులను అందిపుచ్చుకునేందుకు బ్రిటన్‌ పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాను పునరుద్దరించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ఉన్నత విద్యనభ్యసిం చిన విద్యార్థులు ఆ తర్వారెండేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేస్తే వారి ప్రతిభాపాఠవాలను ఉపయో గించుకోవాలని సంకల్పంతో బ్రిటన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రిటన్‌ తాజా నిర్ణయంతో భారతీయులకే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప టికే యూకే ఇమ్మి గ్రేషన్‌ స్టేటస్‌ కలిసి స్టూడెంట్‌గా కోర్సు ను పూర్తి చేసు కున్న భారతీయ విద్యార్థులకు వర్క్‌ వీసా ఎంతగానో ఉపకరిస్తుందని వెల్లడిస్తున్నారు. అటువైపు అమెరికా వీసాలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్న తరుణంలో బ్రిటన్‌ ప్రతిభావంతులకు తలుపులు బార్లా తెరవడం శుభపరి ణామమని చెబుతున్నారు.
 
బ్రిటన్‌ పునరుద్దరించిన పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా విద్యార్థుnలకు అద్భుత అవకాశాలు కల్పించడంలో ఎంతగానోదోహదపడుతుంది. ఈ వీసాకు అర్హులైన విద్యార్థలు .. విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా పనిచేయడంగానీ…. ఇతర కెరీర్‌ ప్రోగ్రాం ప్రారంభిం చడంగానీ, ఏదైనా సంస్థలో ఉద్యోగం చేయడంగానీ చేయవచ్చు.

అంతర్జాతీయంగా ప్రతిభ కలిగిన సైన్స్‌,మ్యాథ్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా అద్భుత అవకాశాలను కల్పిస్తుందని బ్రిటన్‌ హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ తెలియజేశారు. విద్య తర్వాత వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా రావడం వల్ల గ్రాడ్యుయేట్లకు భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా వల్ల భారతీయ విద్యార్థులు తమ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మరికొంతకాలం బ్రిటన్‌లో ఉండి మరిన్ని నైపుణ్యాలు నేర్చుకుని అనుభవాన్ని గడించవచ్చని భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ డోమినిక్‌ ఆస్క్విత్‌ పేర్కొన్నారు.

2019 జూన్‌ నెలాఖరు నాటికి బ్రిటన్‌ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 22 వేలుగా ఉండగా తాజా ప్రకటనతో మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 42 శాతం ఎక్కువకాగా.. గత మూడేళ్లతో పోలిస్తే దాదాపు 100 శాతం ఎక్కువేనని పేర్కొంటున్నారు.