గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:39 IST)

భార్య నిద్రపోతుందని.. విమానంలో 6 గంటల పాటు నిలబడ్డాడు..

భార్య కోసం ఆ భర్త ఆరు గంటల పాటు నిలబడ్డాడు. అదీ విమానంలో. భార్య నిద్రపోతుందని.. ఆమెకు ఇబ్బంది కలగకుండా హాయిగా నిద్రపోవాలని అమెరికాలోని ఇండియానా ప్రావిన్స్‌కు చెందిన లీ జాన్సన్. జాన్సన్ విమానంలో జరిగిన ఓ అద్భుత సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సన్నివేశంలో విమానంలో ఆ వ్యక్తి నిలబడి వుండటం, సీటులో ఆతని భార్య నిద్రిస్తుండటం చూడొచ్చు. 
 
తన భర్తను ఇలా ఇంట్లో అస్సలు నిలబెట్టనని.. అలాంటిది తన కోసం ఆరు గంటల పాటు ఆయన తన కోసం విమానంలో నిలబడి ప్రయాణం చేశాడని చెప్పుకొచ్చారు. అలా ఆరు గంటల పాటు హాయిగా నిద్రపోయానని.. ఇదే నిజమైన ప్రేమ అంటూ పోస్టు చేశారు. 
 
ఈ పోస్టును షేర్ చేసిన చాలామంది భార్య కోసం విమానంలో నిలబడిన భర్తను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాకుండా భార్యపై కూడా విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోతో పాటు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.