మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:31 IST)

స్నేహితుడి భార్యతో అక్రమ లింకు.. అడ్డుగా ఉందనీ భార్య హత్య

తిరుపతిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హత్య చేశాడు కిరాతక భర్త. ఈ దారుణం తిరుపతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైకి చెందిన మురుగన్-సింధియా (40)లు భార్యాభర్తలు. 20 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ క్రమంలో మురుగన్‌కు అతని స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలిసిన భార్య మురుగన్‌ను నిలదీసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న మురుగన్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన భార్యతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. నగరంలోని పీకే లేఅవుట్‌లోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా బెల్టుతో భార్య మెడ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం లాడ్జి నుంచి పరారయ్యాడు.
 
ఉదయం గదిలో చనిపోయిన మహిళను చూసిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ కనిపించకపోవడంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని భావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.