ఖజానాను బాబు వ్యాక్యూమ్ క్లీనర్‌తో ఊడ్చేశాడు... కానీ: మంత్రి రమణ

minister mopidevi
శ్రీ| Last Modified శనివారం, 7 సెప్టెంబరు 2019 (20:57 IST)
రాష్ట్ర ఖజానాను చంద్రబాబు వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసి వెళ్లిపోయినా... సంక్షేమ పథకాలకు ఆర్థిక భారం అడ్డుకానే కాదని నిరూపిస్తూ జగన్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళ్తుంటే...టిడిపి నేతలకు పునాదులు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు.

విశాఖ భూ కుంభకోణాలు పై ఖచ్చితంగా మరో సిట్ వేస్తా
మని.. దోషులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన భూములను మా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించిన మోపిదేవి.... అక్రమ నిర్మాణాలు తొలగింపు అనేది నిరతర౦ కొనసాతుందని వెల్లడించారు. ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపాలనేది మా ఉద్దేశం కాదని...

వాటిల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలనేది మా ఉద్దేశమన్నారు.దీనిపై మరింత చదవండి :