శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (06:58 IST)

జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు: మంత్రి కొడాలి నాని

ఉమ్మడి రాష్ట్రంలోలా కేంద్రీకృత అభివృద్ధి ఒక ప్రాంతంలో జరగకుండా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు.

మంత్రి కొడాలి మాట్లాడుతూ... అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ అమరజీవిని మనమంతా స్మరించుకుంటూ  రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. కలసి మెలసి ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విభజన చిచ్చురేపిందన్నారు.

ఆ గాయాలతో తొలుత ఇబ్బంది ఏర్పడినా పోతుండిన గత 6 ఏళ్ల కాలంలో ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి ప్రజాసంక్షేమంలో దూచుకుదన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగెత్తించేందుకు, ప్రాంతాల్లో సమన్యాయం కోసమే వికేంద్రీకరణ సరైన విధానమని ప్రభుత్వం గట్టిగా భావించిందన్నారు.

ఈ దృష్ట్యా గత ఉమ్మడి రాష్ట్రంలోలా కేంద్రీకృత అభివృద్ధి ఒక ప్రాంతంలో జరగకుండా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరుగులు తీయిస్తున్నారన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటికే పలు విప్లవాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో నవరత్నాలు అమలుతో సంక్షేమం అభివృద్ధికి సరికొత్త మార్గం చూపారన్నారు. 

రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రజా పాలనకు అద్దంపట్టేలా మన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా క్రింద గత ఏడాది రూ . 245 కోట్లు, ఈ ఏడాది మొదటి విడతలో రూ . 178 కొట్లు రెండవ విడత రూ. 245 కోట్లు సుమారు 3 లక్షల మందికి అందించామన్నారు.

కౌలు రైతులకు కూడా భరోసా కల్పించామన్నారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్ లో అందించి రైతులను సకాలంలో ఆదుకున్న ఘనత మన ప్రభుత్వానిదే అని మంత్రి కొడాలి నాని అన్నారు. 5 వేల 200 హెక్టార్లలో పంట నష్టపోయిన 8200 మంది రైతులకు రూ . 6.12 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ అందించామన్నారు.

గత సంవత్సరం ఆగస్టులో వరదలు ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన 10,190 మంది రైతులకు 4472 హెక్టార్లకు చెందిన రైతులకు 6.06 కోట్లు ఇన్పుట్ సబ్సిడిగా అందించామన్నారు .

ఈ ఏడాది ప్రకాశం బ్యారేజి బ్యాగేజ్ నుంచి సుమారు 1000 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోనికి కలిసిందన్నారు . ఈ దృష్ట్యా వృధా నీరును సద్వినియోగం చేసుకునేందుకు పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక ప్రాజెక్టు , మోపిదేవి మండలం బండికోళ్లలంక వద్ద మరో ప్రాజెక్టును . రాష్ట్ర ప్రభుత్వం రూ . 2565 కోట్లతో మంజూరు చేసిందన్నారు.

రైతు శ్రేయస్సు కోసం ఈ ప్రాజెక్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

ఈ విషయంలో రైతాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు . రైతు చేతు నుండి పైసా భారం పడకుండా ప్రభుత్వమే కొత్త మీటర్లు బిగిస్తుందన్నారు . వచ్చే 30 సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన స్పష్టం చేసారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం 1000 కోట్లు బకాయిలు పెట్టిందని వాటిని కూడా మన ప్రభుత్వం రైతులకు చెల్లించిందన్నారు . గత ఏడాది. 1.6 లక్షల మంది రైతుల నుంచి 12.6 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు రూ. 2019 కోట్లు జమ చేశామన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేశానున్నారు.

సాగరమాల రెండవ దశ క్రింద రూ. 345 కోట్లతో మచిలీపట్నంలో ఫిషింగ్ హర్బర్ నిర్మిస్తున్నామన్నారు. అదే విధంగా మచిలీపట్నంలో కొత్త మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. యావత్తు ప్రపంచాన్ని ఈ రోజు కరోనా సమస్య వేదిస్తున్నాదన్నారు.

అసలు టెస్టింగ్ ల్యాబ్ లు లేని దశ నుంచి రాష్ట్రంలో అధిక సంఖ్యలో ల్యాబ్ లు ఏర్పాటు చేయడంతో పాటు దేశంలో ఎక్కడా నిర్వహించని విధంగా రోజుకు 70 వేల కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి దార్శినికతకు , నిబద్ధతకు నిదర్శనమని మంత్రి నాని పేర్కొన్నారు.

ఈ కరోనా మహమ్మరి నుంచి మనల్ని కాపాడటానికి విరంతరం సైనికుల్లా పని చేస్తున్న ఫ్రెంట్ లైన్ వారియర్స్ కు ఈ సందర్భంగా మనందరం మన స్పూర్తిగా జేజేలు పలుకుదామన్నారు. కోవిడ్ నియంత్రణకు తప్పని సరిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి స్వీయనియంత్రణ వంటి ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

పాఠశాలలకు రాని బడి ఈడు పిల్లలు 3 శాతం ఉన్నారని వారందరిని పాఠశాలలకు రప్పించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో జగనన్న అమ్మ ఒడి చేపట్టామన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ఈ పథకం కింద అందించామన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్ ఆర్ చేయూత, వైయస్ఆర్ నేతన్న నేస్తం, కాపునేస్తం, వైయస్ఆర్ వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన తదితర కార్యక్రమాలు అమలు తీరును ఆయన వివరించారు.

రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను భారత ప్రధాని నరేంద్రమోడి ప్రశంసించడంతో పాటు ఇతర రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా సుమారు 4 లక్షల నుంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.

వైయస్ఆర్ ఫిఛనా కానుక క్రింద జిల్లాలో 5 లక్షల 4 వేల 836 మంది లబ్ధిదారులకు రూ. 192 కోట్లు ప్రతి నెల 1 వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతాలకు అందిస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

నిరు పేదల సొంత ఇంటికల నేరవేర్చేందుకు మన ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తల పెడితే జనాభిమాని. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో కొంతమంది వ్యక్తులు కులాలు, మతాలు, వ్యవస్థలు, మీడియాను ప్రేరేపించి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి కార్యక్రమాలు చేరకుండా అడ్డుకునే ప్రయత్నంతో కొంత మంది వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి వారు చేస్తున్న అభివృద్ధి నిరోధక పనులను ప్రజలు త్రిప్పికొట్టాలన్నారు.