సంబంధిత వార్తలు
- అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)
- లోకేశ్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్
- 1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు
- న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్
- ఏపీ లిక్కర్ స్కామ్ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు
భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు
తన సతీమణి నారా భువనేశ్వరికి ఆమె భర్త, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. "భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం, పునాది. ప్రతి ఒడిదొడుకులలో నా పక్కనే ఉన్నారు. ఆమె నా జీవితానికి వెలుగు. భువనేశ్వరి నా జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని. వ్యాపారం, దాతృత్వం... ఇలా అన్నింటిలో ఆమె నాయకత్వం మాకు స్ఫూర్తి అని చంద్రబాబు పేర్కొన్నారు.
భువనేశ్వరి దయాగుణం, ప్రజల పట్ల ఆమెకున్న శ్రద్ధ ప్రశంసనీయమన్నారు. వ్యాపార రంగంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ప్రదర్శిస్తున్న హృదయపూర్వక నాయకత్వం పటిమ తమ అందరికీ స్ఫూర్తి అని చంద్రబాబు కొనియాడారు.
