సంబంధిత వార్తలు
- పోస్టులన్నీ భర్తీ చేయ్, పెద్ద మొగోడు అనుకుంటా: కేటీయార్ పైన షర్మిలా కామెంట్
- అది జాబ్ క్యాలెండర్ కాదు.. జాదూ క్యాలెండర్: నారా లోకేష్ ఫైర్
- పిచ్చోడి చేతిలో రాయిలా124-ఏ సెక్షన్ : జస్టిస్ ఎన్వీ రమణ
- అప్పుల కుప్పలు... ఆర్ధిక స్థితిపై శ్వేత పత్రం ఇవ్వగలరా?
- కేసీఆర్తో ఎందుకు మాట్లాడటం లేదు.. నీటి వివాదంలో సీఎంలపై CBN ఫైర్
బాదుడు రెడ్డి వల్లే పెట్రోల్ ధర శతకం...లోకేష్ ట్వీట్!
ఏపీలో ప్రజల్ని జగన్ పీల్చి పిప్పి చేస్తున్నారని, ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి... ఇపుడు తనే అధికంగా పన్నులు వేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
ఇండియన్ పెట్రోల్ లీగ్‍లో రికార్డుల మోత మోగిస్తూ, పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి.... బాదుడు రెడ్డి అనే పేరును సార్దకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 31 శాతం వ్యాట్+లీటర్‍కు రూ.4 అదనపు వ్యాట్+ లీటర్‍కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి... ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్‍కు 30 రూపాయలు అని లెక్క తేల్చారు లోకేష్.
ప్రతిపక్షంలో ఉండగా, పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చన్న బాదుడు రెడ్డి, ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదు? అని ప్రశ్నించారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డు పెట్టారంటే, మీ దోపిడీ ఏ రెంజ్‍లో ఉందో అర్థమవుతోంది... ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
