1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara lokesh fires on ysrcp leaders

మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను.. మీ తల్లి గురించి మాట్లాడితే?

Nara lokesh
ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆ మాటలకూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కన్నీరు పెట్టుకోగా..నందమూరి కుటుంబ సభ్యులు సైతం మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. 
 
ఈ వ్యవహారాన్ని వదిలే ప్రసక్తే లేదని నారా లోకేష్ అన్నారు. నిన్నటికి నిన్న తిరుపతి లో పర్యటించిన నారా భువనేశ్వరి సైతం ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా నారా లోకేష్ నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను అంటూ హెచ్చరించారు. 
 
మీ త‌ల్లి గురించి ఇలాగే మాట్లాడితే వదిలేస్తారా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల‌ని ఓ రేంజ్‌లో రెచ్చి పోయారు. మీరు మ‌నుషులా లేక ప‌శువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీలో 15 థియేటర్లు సీజ్.. ఎందుకో తెలుసా?