బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (16:15 IST)

వైకాపా కార్యకర్తలూ పండగ చేస్కోండి... నారా లోకేష్

"మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి", "మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానిదే"  ఏమి చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. 
 
మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత యేడాదికన్నా రూ.2,297 కోట్లు ఎక్కువ అంచనా వేశారు. 
ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. 
 
ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తర్వాత, మద్యంవాలంటీర్లు. పండగ చేసుకోండి అంటూ ట్వీట్ చేశారు.