1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RRR Files Attempt To Murder Case on Jagan

జగన్‌పై కేసు పెట్టేందుకు సిద్ధమైన రఘురామకృష్ణంరాజు

RRR_Chandra Babu
ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ ఫైర్ బ్రాండ్. ఇంకా రెబల్. ఐదేళ్లపాటు వైసీపీతో హోరాహోరీగా సాగిన పోరు అనంతరం ఆ పార్టీని వీడి టీడీపీ టికెట్‌పై ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్‌కు చుక్కలు చూపించే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌పై ఉండి ఎమ్మెల్యే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై రఘు రామకృష్ణంరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు.
 
ఈ సంఘటనలు 2021 నాటివి ఆర్ఆర్ఆర్‌ని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు, పోలీసులు తనను కస్టడీలో పెట్టారని ఆరోపించారు. ఈ సంవత్సరం ఎన్నికలలో అధికారాన్ని కోల్పోవడం ద్వారా ఇప్పటికే కష్టాల్లో వున్న జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టడం ద్వారా ఆర్ఆర్ఆర్ మళ్లీ జగన్‌పై వార్ మొదలెట్టారని చెప్పాలి. 
తర్వాతి కథనం
మలావిలో విమానం మిస్సింగ్... వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ పరిస్థితి ఏంటి?