ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (13:56 IST)

బాబును కొనియాడిన స్వామి స్వరూపానంద.. స్వామీజీనా లేక ఊసరవెల్లినా?

Swami Swaroopanandendra
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానంద ప్రెస్‌మీట్‌ పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆశీర్వదించారు. తానెప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసే ప్రయత్నం చేసి సీఎం హోదాను పూర్తి స్థాయిలో కొనియాడారు. 
 
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు స్వామి స్వరూపానంద సరస్వతి సహాయం తీసుకున్నారు. ఆ సమయంలో జగన్ ఆలయ యాత్రలు కూడా చేశారు. ఈ సందర్భంగా స్వామి జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు నాయుడుపై రాజకీయ విమర్శలు చేసేవారు. 
 
అధికారంలోకి వచ్చాక జగన్ ప్రతి విషయంలో స్వామి సలహాలు తీసుకునేవారు. కొత్తవలసలో నామమాత్రంగా ఎకరం లక్ష రూపాయలతో 15 కోట్ల భూమిని జగన్ బహుమతిగా ఇచ్చారన్న ఆరోపణలు వున్నాయి.
 
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని స్వామి భయపడి డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగుతున్నారు. ఆయన స్వామీజీనా లేక ఊసరవెల్లి అని సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్నారు. 
 
కొత్తవలసలో కేటాయించిన భూములను చంద్రబాబు లాక్కుంటారని స్వరూపానంద భయపడుతున్నారని అంటున్నారు. రాజకీయాలు చేసే స్వామీజీలకు చంద్రబాబు దూరం కావాలని కోరారు.