శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (17:33 IST)

ముక్కు పచ్చలారని ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. పొరుగింటి అబ్బాయి..?

ముక్కు పచ్చలారని ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అమానుష ఘటన జిల్లాలోని పత్తిపాక పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం ఉదయం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల బాలికపై ఓ మైనర్ ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని పొరుగింటి అబ్బాయికి చెప్పి వెళ్లింది. 
 
దీన్ని అదునుగా భావించిన ఆ మైనర్‌.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అవమానాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరుచుతామని పోలీసులు తెలిపారు.