ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (13:03 IST)

14 ఏళ్ల పాఠశాల బాలిక ప్రసవించింది.. శిశువును ఫ్రీజర్‌లో దాచింది..

గర్భం దాల్చిన 14 ఏళ్ల పాఠశాల బాలిక ప్రసవించడంతో తల్లిదండ్రులకు భయపడి నవజాత శిశువును ఫ్రీజరులో దాచిన దారుణ ఘటన రష్యాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్క్స్ నగరానికి సమీపంలోని వర్ద్ తులా గ్రామానికి చెందిన 14 ఏళ్ల పాఠశాల బాలిక గర్భం దాల్చింది. 
 
ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఇంట్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు ప్రసవించిన బిడ్డ గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడిన బాలిక నవజాత శిశువును ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఆమె తండ్రి తోట పనిలో ఉన్నపుడు గ్యారేజీ ఫ్రీజరులో దాచింది.
 
బాలిక ప్రసవించిన తర్వాత రక్తస్రావం చూసి ఆమె తల్లి తన కూతురు అపెండిసైటిస్‌తో బాధపడుతుందని అంబులెన్సను ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చేరిన బాలిక తనకు జన్మించిన నవజాత శిశువును ఫ్రీజరులో ఉంచానని చెప్పడంతో వెళ్లి చూడగా ఆ శిశువు మరణించి ఉంది. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.