1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. three persons gang raped on Disabled woman

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చే

gang rape
మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరకు స్థానికులు గుర్తించి వికలాంగురాలిని కాపాడారు. 
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన రేవతి అనే యువతి తన అక్క ఇంటికి వెళ్ళేందుకు నెలిమర్ల వద్ద ఆటో ఎక్కింది. తాను దిగాల్సిన ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆటోను నిలపలేదు. నేరుగా పూల్‌బాగ్ లోని చెట్ల పొదల్లోకి ఆటోను తీసుకెళ్ళాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఆమె నోటిని గట్టిగా మూసిపెట్టారు. 
 
ఆటోలోనే ఒకరి తరువాత ఒకరు సామూహికంగా వికలాంగురాలిపై అత్యాచారం చేశారు. విషయం బయటకు ఎక్కడ వస్తుందేమోనని ఆమె హత్య చేసేందుకు ప్రయ్నతించారు. దీంతో రేవతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
About Writer
TJ
తర్వాతి కథనం
టిడిపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి... ఏ పదవిస్తారో తెలుసా..?