శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Mohan
Last Modified: గురువారం, 11 జనవరి 2018 (14:28 IST)

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసా

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారని ఎంకేబీనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన సతీష్(29), అజయ్‌పుత్తిర్(22), యువరాజ్(26), దినేష్(24) అనే రౌడీలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.