శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:51 IST)

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టుకుంది... సి.ఆర్

ఢిల్లీలో దీక్ష చారిత్రిక విజయం అని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు దీక్ష కొయ్యగురంపై స్వారీ చేసినట్లు ఉంది అంటూ వైసీపీ సీనియ‌ర్ నేత సి.రామ‌చంద్ర‌య్య మండిప‌డ్డారు. పార్టీ ప్రయోజనాల కోసం చంద్రబాబు దీక్ష చేశారు... ప్రజల కోసం కాదు. పది కోట్ల ప్రజల డబ్బుతో డ్రామా ఏంటి...? మీ పార్టీ డబ్బుతో ఖర్చు పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు ముందుగానే తాకట్టు పెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చంద్రబాబు దీక్షకు ఎందుకు వెళ్లలేదు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కోశాధికారిగా చంద్రబాబు పని చేస్తున్నాడు. గతంలో ముప్పై శాతం నాది కాంగ్రెస్ బ్లడ్ అన్నారు. ఇప్పుడు వంద శాతం అయింది.
 
చంద్రబాబు, సోనియాగాంధీని తిట్టారు... రాహుల్‌ని తిట్టారు. రాహుల్ చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. రాహుల్ గాంధీకి పౌరుషం ఉందా.? అని ప్ర‌శ్నించారు. వామపక్షాలకు చంద్రబాబు గురించి తెలుసు.. అందుకే దీక్షకు వెళ్లలేదు. వైసీపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో అవిశ్వాసం పెడితే ఒక్కరు నోరు మెదపలేదు. రాహుల్ గాంధీ గుంటూరు వస్తే చంద్రబాబు రాళ్లు వేయించారు..గో బ్యాక్ అన్నారు.
 
ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ ఉందా.? చంద్రబాబు అవినీతిపై రాష్ట్ర కాంగ్రెస్ పుస్తకాలు వేసింది. ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదా.? టీడీపీని కాంగ్రెస్‌లో చంద్రబాబు విలీనం చేసినా ఆశ్చర్యం లేదు. వ‌చ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒడిపోతున్నారు. అందుకే పొలిటికల్ కంపల్సన్ అంటున్నారు.
 
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టుకుంది. ప్రజల సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరిలో ఉందా. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశారు. జగన్ ప్రజల్లో ఉండాలి అని ఉంటుంది... చంద్రబాబు మీడియాలో ఉండాలి అని చూస్తారు. బాబు ఓడిపోవడం ఖాయం... అవినీతిపై విచారణ జరిపితే జైల్‌కి వెళ్లడం ఖాయం. 29 సార్లు ఢిల్లీ వెళ్లి సాధించింది ఏంటి..? ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రులు ఉండి ఏమి సాధించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి సుజనా చౌదరి, సీఎం రమేష్, జైట్లీ, వెంకయ్య నాయుడు కలిసి ఫైనల్ చేశారు. చంద్రబాబుకి సీఎం పదవి, ఆయన కొడుక్కి మంత్రి పదవి, ఆయన అవినీతిపై విచారణ జరగకపోవడమే ప్రత్యేక హోదా అని వైసీపీ నేత సి.రామ‌చంద్ర‌య్య అన్నారు.