గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (17:20 IST)

జగన్ మావాడు... కులం కార్డుతో గెలవాలనుకుంటున్నాడు... జేసీ: బాబు చిరునవ్వు...

జేసీ దివాకర్ రెడ్డి. ఈ పేరు చెబితే ఎవరైనా అబ్బో ఆయనా అంటారు. ఎందుకంటే.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జేసీది. తన మనసులో ఏమున్నదో వున్నదివున్నట్లు మాట్లాడేస్తుంటారు. ఆయన మాటలతో ఎదుటి వ్యక్తులు చాలాసార్లు ఇబ్బందులు పడుతుంటారు. కక్కలేక మింగలేక నవ్వుకుంటారు. జేసీ స్టయిలే సెపరేటు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఇవాళ అనంతపురంలో ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడారు. తన సెటైర్లను ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపైన ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కులం పిచ్చి పట్టుకుందనీ, మావాడు జగన్.. రెడ్డి కులం కార్డుతో గెలవాలనకుంటున్నాడనీ, ఒకాయన రెడ్డి అంటే మరో ఆయన బలిజ అనీ, ఇంకొకాయని ఇంకోటి అంటారంటూ సెటైర్లు విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ... మీరు ఒక్క కులంతో సీఎం అయ్యారా? రెడ్డి, కమ్మ, బలిజ... మొత్తం అన్ని కులాలను కలుపుకుని వెళ్లారు కనుక సీఎం అయ్యారు. 
 
రెడ్లు ఎంతమంది వున్నారు? ఆరేడు పర్సెంట్ కంటే లేరు. కమ్మ కులం మాకంటే తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద జేసీ వ్యాఖ్యలతో అక్కడివారితో పాటు సీఎం చంద్రబాబు కూడా ముసిముసిగా నవ్వారు.