1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP MLA Arrested In Journalist Satyanarayana's Murder Case

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య... వైకాపా ఎమ్మెల్యే అరెస్టు?

YSR Congress Party
కాకినాడలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. గత మంగళవారం వెంకటాపురం నుంచి అన్నవరం వస్తుడంగా ఈ హత్య జరిగింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన నిందితులంతా పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీచేశారు. అసాంఘిక శక్తుల గురించి వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనలో నిజానిజాలపై వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, డీజీపీలను ఆదేశించారు. 
తర్వాతి కథనం
జగన్ పేషీలో ఒకే సామాజికవర్గానికి పెద్దపీట... షాకిచ్చిన అమిత్ షా!