వైఎస్ఆర్ నవోదయం : సీఎం జగన్ మరో స్కీమ్

ydata-srcp
ఠాగూర్| Last Updated: గురువారం, 17 అక్టోబరు 2019 (14:07 IST)
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన రుణాలను ఒకే విడతలో రీస్ట్రక్చర్ చేసేందుకు వీలుగా వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని గురువారం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పరిశ్రమల శాఖ ఈ పథకాన్ని ప్రారంభించనుంది.

2020 మార్చి 31 తేదీ లోపు ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు రీషెడ్యూలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని పరిశ్రమల శాఖ తెలిపింది.

వైఎస్ఆర్ నవోదయం పేరిట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు ఏక కాలంలో రీషెడ్యూలు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆ ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

9 నెలల కాలంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన రుణాలు రీషెడ్యూలు చేసేలా సదరు బ్యాంకులకు ప్రభుత్వం హామీలు జారీ చేయనుంది. ఒన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ పేరిట ఈ కార్యాచరణ చేపట్టనున్నారు. 2020 మార్చి 31 లోగా ఎంఎస్ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రుణాలు 2019 జనవరి 1 తేదీ నాటికి 25 కోట్ల రూపాయలకు మించి ఉండకూడదని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.

రుణాల రీస్ట్రక్చర్ చేసే తేదీ నాటికి సదరు ఎంఎస్ఎంఈ పరిశ్రమ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. జిల్లాల వారీగా రుణ ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ నియమించిన ప్రభుత్వం.. దీని కోసం రూ. 10 కోట్లను కేటాయించింది.

రూ. 25కోట్ల వరకూ బకాయిపడిన సూక్ష్మ చిన్నమధ్య తరహా పరిశ్రమలనే రుణాల రీషెడ్యూలుకు పరిగణనలోకి తీసుకుంటారు. రుణాల రీస్ట్రక్చర్ కోసం ఎంఎస్ఎంఈలు 2020 మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :