సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 అక్టోబరు 2019 (17:22 IST)

సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రారంభమైన "ఆటో రజని" చిత్రం

జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని". ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాతో తన డాన్సులతో, యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".

 
జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ చిత్రం అయిన ఈ సినిమాకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించారు. ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన మా హీరోకి ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది అన్నారు దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్. ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యలయంలో వైస్ జగన్‌ను కలసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు జొన్నలగడ్డ హరికృష్ణ. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రంగా మా "ఆటో రజని" నిలిచిపోతుంది అన్నారు దర్శక, నిర్మాతలు. అంతేకాకుండా ఎలెక్షన్ టైంలో మేము చేసిన 'జననేత జగనన్న' పాట గురించి ప్రత్యేకంగా మమ్ములను జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేము. 
 
అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. హీరోయిన్, ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్.