చంబల్ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల అధ్యక్షుడుగా డా. గజల్ శ్రీనివాస్
చంబల్ 3వ ఆసిఫ్ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలకు గౌరవ అధ్యక్షుడుగా ప్రఖ్యాత గాయకులు, ట్రిపుల్ గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్, సినీ నటులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు చంబల్ ఫౌండేషన్ సంచాలకులు జనాబ్ షా ఆలం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ చిలనచిత్రోత్సవం ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండీలో జరుగనున్నాయి. ఇందులో మన దేశానికి చెందిన చిత్రాలతో పాటు టర్కీ, జర్మనీ, యుస్ఏ, ఇరాన్, ఇటలీ, సింగపూర్ వంటి దేశాలకు చెందిన చలన, లఘు, చిత్రాలను ప్రదర్శించనున్నారు.
ఈ వేడుకల ప్రారంభ సభలో గజల్ శ్రీనివాస్ రూపొందించిన "చంబల్ చంబల్" అనే పేరుతో సాగే వీడియో గీతం ఆవిష్కరణ జరుగుతుందని జనాబ్ షా ఆలం వెల్లడించారు.