శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (20:42 IST)

రెండేళ్ల నుంచి అది పట్టుకుని తిరుగుతున్నాడు... పాపం క‌ళ్యాణ్ కృష్ణ..‌. ఎంత ప‌నైంది?

అక్కినేని నాగార్జున న‌టించిన‌ చిత్రాల్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి సొగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ సినిమా ద్వారా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఇచ్చిన విజ‌యంతో సీక్వెల్ తీయాల‌ని.. ఆ మూవీకి బంగార్రాజు టైటిల్ పెట్టాల‌ని అప్పుడే నాగ్ ఫిక్స్ అయ్యారు. ఈ టైటిల్‌ని రిజిష్ట‌ర్ కూడా చేయించారు. 
 
గ‌త కొంత కాలంగా బంగార్రాజు వార్త‌ల్లో ఉంటుంది కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. మ‌న్మ‌థుడు 2 షూటింగ్ పూర్తి చేసిన నాగ్... జులై నుంచి బంగార్రాజు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నారు. అయితే.. నాగ్ ప్ర‌స్తుతం బిగ్ బాస్ 3లో బిజీగా ఉన్నారు. మూడు నెల‌ల పాటు బిగ్ బాస్ 3 ఉంటుంది. మ‌రోవైపు నాగ చైత‌న్య వెంకీ మామ సినిమా చేస్తున్నాడు.
 
సెప్టెంబ‌ర్ నుంచి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా స్టార్ట్ చేయ‌నున్నాడు. ఈ రెండు సినిమాల‌తో చైత‌న్య బిజీ. అందుచేత సంక్రాంతికి వ‌స్తాడ‌నుకున్న బంగార్రాజు రావ‌డం లేద‌ని తెలిసింది. నాగ్ - చైతు ప్ర‌స్తుతం ఓకే చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన త‌ర్వాత బంగార్రాజు స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ ఇయ‌ర్ ఎండింగ్‌లో స్టార్ట్ చేసి స‌మ్మ‌ర్‌కి రిలీజ్ చేస్తార‌ని తెలిసింది. క‌ళ్యాణ్ కృష్ణ రెండు సంవ‌త్స‌రాల నుంచి ఈ సినిమా స్ర్కిప్ట్ పైన వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అనుకుంటే... ఇంకా లేట్ అవుతుంది. పాపం.. క‌ళ్యాణ్ కృష్ణ ఎంత ప‌నైంది.