సంబంధిత వార్తలు
- ఆసక్తినిరేకెత్తించే 'నిను వీడని నీడను నేనే' మూవీ రివ్యూ
- ప్రభాస్ 'సాహో' షూటింగ్ ఇక ఆగదా... ఆస్ట్రియా, కురేషియా లోకేషన్స్‌లో...
- ఆగష్టు 15న ప్రభాస్‌కి త్రిముఖ పోరు తప్పేలా లేదు..! (Video)
- ఆన్లైన్లో 2019 అక్టోబర్ నెల ఆర్జిత సేవలు... సుప్రభాత సేవా టిక్కెట్లు 7,180
- సాహో షూటింగ్ ఎంతవరకు వచ్చింది... అసలు ప్రభాస్ ఎక్కడున్నాడు..?
సందీప్ ఫస్ట్ టికెట్ ఆ హీరోకి ఇచ్చాడా..?
యువ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈరోజు (జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నరాత్రి సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్, సుధీర్ బాబు, కార్తికేయ, విష్వక్సేన్ హాజరయ్యారు.
ఈ సినిమా సెకండ్ టికెట్ ఈ యువ హీరోలకు సందీప్ కిషన్ అందజేశాడు. ఫస్ట్ టికెట్ ఏ హీరోకి ఇవ్వనున్నది తర్వాత చెబుతానని అన్నాడు. దీంతో ఎవరికి ఇస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే... ఈ రోజు సందీప్ కిషన్ తన సినిమా ఫస్ట్ టికెట్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి అందజేశాడు. హైదరాబాద్ ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్‌ను ప్రభాస్‌కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఖచ్చితంగా సందీప్ కిషన్‌కి విజయాన్ని అందిస్తుందని టీమ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎప్పటి నుంచో సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తోన్న సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.
