బాలీవుడ్‌లో ఓ బేబి... ప్లాన్ చేస్తుంది ఎవరో తెలుసా..?
సమంత అక్కినేని తాజా సంచలనం ఓ..బేబి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న కథా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం రికార్డుస్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సమంత బేబి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె కాకుండా ఈ పాత్రకు వేరే వాళ్లను ఊహించుకోలేం అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సమంతను అభినందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బేబి బాలీవుడ్‌కి వెళుతుంది అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడం.. తెలుగు దర్శకులు తెరకెక్కించిన బాలీవుడ్ సినిమాలు సైతం చరిత్ర సృష్టిస్తుండటంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు తెలుగు సినిమా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బాలీవుడ్ దృష్టి ఇప్పుడు తాజా సంచలనం ఓ..బేబిపై పడిందట.
బాలీవుడ్‌లో బేబిని రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నాగశౌర్య పోషించిన పాత్రను దగ్గుబాటి రానా చేయనున్నాడని.. సమంత పాత్రను కంగనా కానీ.. అలియా భట్ కానీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.