గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (12:43 IST)

ఆసక్తినిరేకెత్తించే 'నిను వీడ‌ని నీడ‌ను నేనే' మూవీ రివ్యూ

నటీనటులు : సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు. 
సంగీతం: ఎస్.ఎస్.థమన్, 
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌,
నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, 
దర్శకుడు: కార్తీక్ రాజు.
 
కథ..    
అర్జున్ (సందీప్ కిషన్) మాధవి (అనన్యా సింగ్) వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ నినువీడను నేను అంతగా జీవిస్తుంటారు. ఓరోజు కారు ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరి ఫేస్‌లు అద్దంలో వేరొకరివిగా కన్పిస్తాయి. ఆ ఇద్దరికీవీరికి సంబంధం ఏమిటి.. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు వీరి కారు ప్రమాదం నిజమేనా ఎవరైనా చంపారా.. అనేది మిగిలిన సినిమా..
 
విశ్లేషణ.. 
ఇది రెండు బుర్రల కథగా చెప్పొచ్చు. ఇటీవలే వచ్చిన బుర్రకథలో ఒకే మనిషిలో ఇద్దరు బుర్రలతో ప్రవర్తించడంతో అది వర్కవుట్ కాలేదు. కానీ ఇందులో ఒక బాడీలోమరో బాడీ చేరడం, అతను లాగే ప్రర్తించడం ప్రత్యేకత. ఇందులో నటనపరంగా సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ బాగా చేశారు. అనన్య బాగుంది. మురళీ శర్మ డాక్టర్‌గా, ఏసీపీగా పోసాని నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంది. 
 
నిర్మాతగా సందీప్ కొత్తసినిమా చేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు కార్తీక్ రాజ్ కొత్తవాడైనా విఎఫ్ఎక్స్ అనుభవం గలవాడు కనుక వాటితో మెస్మరైజ్ చేశాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఎమోషన్స్ బాగా డీల్ చేశారు. అయితే భవిష్యత్‌లో ఆ త్మకథలు ఇలావుంటాయని చేసిన ప్రయత్నమిది. కాస్త కన్‌ఫ్యుజ్‌గా వున్నా థ్రిల్లర్ చిత్తాలు ఎంజాయ్ చేసే వారికి నచ్చుతుంది. హాలీవుడ్ సినిమాలకు స్ఫూర్తిగా అనిపించినా బాగా డీల్ చేశాడు.