రెజీనా మంచి ఫ్రెండ్ మాత్రమే: హీరో సందీప్ కిషన్

Regina Cassandra
మోహన్| Last Updated: శుక్రవారం, 28 జూన్ 2019 (17:36 IST)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రస్థానం, చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించిన హీరో సందీప్ కిషన్ తన వ్యక్తిగత విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నట్లు, తన జీవితంలో ఏ అమ్మాయి లేదని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం వరకు తాను ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు, ఆ తర్వాత అది కాస్త దూరమైందని తెలిపాడు. 
 
ఆ అమ్మాయి పేరు బహిర్గతం చేయడం తప్పని, ప్రస్తుతం ఆమె జీవితం హాయిగా నడుస్తోందని, అలాగే తన జీవితం కూడా తాను హాయిగా గడుపుతున్నట్లు చెప్పాడు. అయితే ఆమె పేరును మాత్రం చెప్పలేనని అన్నాడు. తన నుండి వేరుపడిన వ్యక్తి గురించి చెప్పడం సబబు కాదని చెప్పాడు.
 
కాగా హీరోయిన్ రెజీనాతో తనకు ఏదో సంబంధం ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనంటూ సందీప్ కిషన్ తెలిపాడు. మేమిద్దరం మంచి మిత్రులమని, ఈ ఉదయం కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు.దీనిపై మరింత చదవండి :