ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (15:28 IST)

"ధృవ" విలన్ సరసన హీరోయిన్‌గా రెజీనా

రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసా

రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసారించింది. 
 
అక్కడ ఆమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రోజా చిత్రం హీరో, ధృవ విలన్ అరవిందస్వామికి జోడీగా రెజీనాను ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరుగనుంది.
 
'ఎన్నమో నడక్కుదు', 'అచ్చమిండ్రి' అనే చిత్రాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవిందస్వామికి అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి రెజీనా, అరవింద స్వామిల కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే.