గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (18:39 IST)

జిగేల్ రాణికి షాకిచ్చిన ప్రభాస్.. ఎందుకో తెలుసా?

బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.

బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్నాడు. 
 
జిల్ సినిమా తరువాత రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేని తీసుకోవాలని దర్శకుడు రాధాకృష్ణ సంప్రదింపులు జరిపారట. దీంతో ప్రభాస్‌తో పూజా హెగ్డే నటించడం ఖాయమనుకున్న వేళ.. ప్రభాస్ పూజకు షాక్ ఇచ్చాడట. 
 
పూజా హెగ్డే వద్దని వేరే హీరోయిన్‌ను చూడమని దర్శకనిర్మాతలకు ప్రభాస్ సూచించినట్లు సమాచారం. హీరోయిన్‌గా పూజా హెగ్డేకు హిట్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. అందుకే ప్రభాస్ పూజాను పక్కనబెట్టాడని తెలిసింది. దీంతో సినీ దర్శకనిర్మాతలు వేరొక హీరోయిన్‌ను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. ప్రభాస్ నిర్ణయంతో పూజా సైలెంట్‌గా వుండిపోయిందట. ప్రస్తుతం పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అలానే మహేష్ సరసన మహర్షి సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.