శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 16 ఆగస్టు 2018 (21:22 IST)

శ్రద్ధా కపూర్ పెద్ద సోమరి... ప్రభాస్ చిరుత పులి వేగం...

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలి తరువాత చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెతికారు. కొంతమంది పేర్లు అనుకుని చివరకు వారిని పక్కన పెట్టేశారు. చివరకు శ్రద్ధా కఫూర్‌ను ఫిక్స్ చేశారు.

సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతోంది. అయితే షూటింగ్‌కు శ్రద్ధా కపూర్ చాలా ఆలస్యంగా వస్తోందట. ప్రతిరోజు షూటింగ్‌లో ఇలాగే చేస్తోందట. కారణం ఆమె ఫిట్నెస్‌లో బిజీగా ఉండటమేనట. అయితే ప్రభాస్ మాత్రం అనుకున్న సమయానికే షూటింగ్ ప్రాంతానికి వస్తున్నారట. కానీ హీరోయిన్ మాత్రం రాకపోవడంతో ప్రభాస్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట.
 
దీంతో హీరోయిన్ పైన ప్రభాస్‌కు చిర్రెత్తుకొస్తోందట. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ప్రభాస్ షూటింగ్ స్పాట్లో హీరోయిన్ ఆలస్యంగా రావడంపై చిర్రుబుర్రులాడటం ఆశ్చర్యానికి గురిచేస్తోందట. డైరెక్టర్, నిర్మాతలు పట్టించుకోకపోతే ప్రభాస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారన్న అనుమానం కలుగుతోందట. శ్రద్ధా సినిమాలో నటించడం ఇష్టం లేకనా.. లేకుంటే ఆమె ఆలస్యంగా రావడం ఇష్టం లేక ప్రభాస్ ఇలా చేస్తున్నారో సినిమా యూనిట్ సభ్యులకు అస్సలు అర్థం కావడం లేదట. వీరిద్దరి మధ్య గొడవ తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది.