శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (16:31 IST)

'సాహో' ధర రూ.550 కోట్లు... బెదిరిపోయిన బాలీవుడ్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటి

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చే యేడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఒకటి రూ.550 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్త హక్కుల్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌తో యువీ సంస్థ సినిమా పూర్తవక ముందే మంచి లాభాల్ని అందుకున్నట్టయింది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు.