మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (12:59 IST)

#100DaysToKingPRABHASBday హ్యాష్‌ట్యాగ్‌పై సిద్ధార్థ్ వెటకారం..?

''బాయ్స్'' సినిమా హీరో సిద్ధార్థ్‌కు ప్రస్తుతం ఆఫర్లు అంతగా రావట్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ సుపరిచితమైన సిద్ధార్థ్.. గతంలో ''గృహం'' అనే సినిమాలో నటించి.. మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో

''బాయ్స్'' సినిమా హీరో సిద్ధార్థ్‌కు ప్రస్తుతం ఆఫర్లు అంతగా రావట్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ సుపరిచితమైన సిద్ధార్థ్.. గతంలో ''గృహం'' అనే సినిమాలో నటించి.. మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ సిద్ధార్థ్.. రెబల్ స్టార్, బాహుబలి హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్ర‌భాస్ అభిమానులు రీసెంట్‌గా #100DaysToKingPRABHASBday అనే హ్యాష్ ట్యాగ్‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. త‌మిళ క్రిటిక్ ర‌మేష్ బాలా.. ప్ర‌భాస్ పుట్టిన రోజుకి వంద రోజులు ఉంద‌ని, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్‌తో కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింద‌ని ట్వీట్ చేశాడు. 
 
దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ తన తదుపరి పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ #465DayToKingPRABHASNextBday అనే హ్యాష్ ట్యాగ్‌ని త‌న ట్వీట్‌కి జ‌త చేసి కామెంట్‌ చేశాడు. అంతేకాదు థ్రిల్ కిల్ చేస్తుంద‌ని అన్నాడు. సిద్ధార్థ్ ట్వీట్స్ కాస్త వెట‌కారంగా అనిపించ‌డంతో అత‌నిని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌. 
 
నువ్విలాంటి ట్వీట్ రజనీకాంత్, అజిత్, విజయ్ ఫ్యాన్స్‌కు వేసివుంటే తర్వాతి నిమిషంలో ట్విట్టర్ నుంచి బయటికి వెళ్లేవాడవని ప్రభాస్ ఫ్యాన్ మండిపడ్డాడు. దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. రోజు రోజుకి హ్యాష్ ట్యాగ్ అనేది జోక్‌గా మారింది. ''నా జోక్‌కి ప్ర‌జ‌లు కూడా న‌వ్వుతారు. ట్విట్ట‌ర్ నుండి బ‌య‌ట‌కు వెళ్ళాల‌ని ఎవరు కోరుకోరు'' అంటూ సిద్ధూ ట్వీట్ చేశాడు. 
 
మరో ప్రభాస్ ఫ్యాన్.. డార్లింగ్ కూడా నీ జోక్ విని నవ్వుకుంటారని చెప్పాడు. ప్రభాస్ ఫ్రెండ్ కాబట్టే అలా కామెంట్ చేశావ్. ప్రతిదానికి టెన్షన్ ఎందుకు.. లైట్‌గా తీసుకుంటే పోలా అంటూ కామెంట్ చేశాడు. అయితే ట్విట్టర్లో కొద్దిసేపటికి ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధార్థ్‌ ట్వీట్‌పై మండిపడ్డారు.