మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (10:39 IST)

ఒక్క భాషలోనే 3500 స్క్రీన్లలో ప్రభాస్ "సాహో"

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ తెలుగుతో సమానంగా హిందీ మార్కెట్‌పై గురిపెట్టింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం ఒక్క హిందీలోనే 3500 స్క్రీన్లలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
హిందీలోనే ఇలావుంటే ఇక ప్రధాన మార్కెట్ తెలుగులో ఏ స్థాయిలో విడుదలచేస్తారో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే, పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.