ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (11:59 IST)

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ట్రైల‌ర్ విడుద‌ల‌

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మారుతి ఇపుడు ఓ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయ‌న "బ్రాండ్ బాబు" అనే చిత్రానికి క‌థ అందించారు. సుమంత్ శైలేంద్ర.. ఈషా రెబ్బా ప్ర‌ధాన పాత్ర

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మారుతి ఇపుడు ఓ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయ‌న "బ్రాండ్ బాబు" అనే చిత్రానికి క‌థ అందించారు. సుమంత్ శైలేంద్ర.. ఈషా రెబ్బా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌భాక‌ర్‌.పి తెర‌కెక్కిస్తున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రానికి ప్రమోష‌న్స్ చేస్తున్నారు. తొలుత టీజ‌ర్‌ను విడుదల చేసిన తర్వాత ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు స‌ర‌దాగా క‌నిపించాయి. ఏ వ‌స్తువులోనైన బ్రాండ్ చూసే అబ్బాయి పెళ్లి విష‌యంలో మాత్రం టీ స్టాల్ న‌డుపుకునే అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.
 
ఈ చిత్రం అటు యూత్ ఇటు ఫ్యామిలీకి బాగా క‌నెక్ట్ అయ్యేలా క‌నిపిస్తోంది. ఇందులో మురళీ శర్మ కీలకమైన పాత్ర పోషిస్తుండ‌గా, రాజారవీంద్ర .. 'సత్యం' రాజేశ్ .. పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. 'బ్రాండ్ బాబు' ద్వారా హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతోన్న సుమంత్ శైలేంద్రకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.