శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (12:33 IST)

''కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా''

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. 
 
ఇందులో జ‌గ‌ప‌తి బాబు డైలాగ్స్‌, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా వున్నాయి. 
 
అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది.