శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (14:15 IST)

ఎన్టీఆర్ రెండో కుమారుడి పేరేంటో తెలుసా?

ఎన్టీఆర్ ముద్దుల రెండో కుమారుడికి నామకరణం జరిగింది. ఎప్పటికప్పుడూ అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో వుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధ్రువీకరించారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ర

ఎన్టీఆర్ ముద్దుల రెండో కుమారుడికి నామకరణం జరిగింది. ఎప్పటికప్పుడూ అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో వుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధ్రువీకరించారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయ్యారు. రెండోసారి కూడా ఆయన సతీమణి ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఎన్టీఆర్ వెంటనే అభిమానులతో పంచుకున్నాడు.
 
తాజాగా రెండో బాబుకు నామకరణ మహోత్సవం జరిపారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మొదటి కుమారుడికి అభయ్‌రామ్‌గా పేరు పెట్టిన ఎన్టీఆర్, తన రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేసినట్టుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. 
 
దీనితోపాటు భార్గవ్ రామ్‌ని ఎన్టీఆర్, ప్రణతి, అభయ్ ఆప్యాయంగా చూస్తున్న పిక్‌ను షేర్ చేశాడు. ఈ పిక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి