శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:27 IST)

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నియామక పత్రాలు

పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ‘‘ఎ’’ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. 
 
అనంతరం అక్కడకు వచ్చినవారి నుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమల బయల్దేరి వెళ్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.