చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని రాస్తారా?
అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి పై బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు విషం కక్కే కార్యక్రమంకు ఎల్లో మీడియా వంతపాడుతోంది. ఎల్లో మీడియాతో ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం తండ్రి కొడుకులు చేస్తున్నారుని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లో మీడియా మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయి.
దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని అంబటి వ్యాఖ్యానించారు.
రివర్స్ టెండర్లు అద్భుతమైన విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారు. పీపీఏ ద్వారా ఏడాదికి 2500 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది. పీపీఎల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేసారు.
87 కోట్ల రుణాలు చంద్రబాబు 24 కోట్లకు కుదించారు. 24 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పి రూ.15కోట్లు చంద్రబాబు రుణమాఫీ చేశారు. 4,5 రుణమాఫీ ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం. సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తుంటే పేపర్ లీకేజీ అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి 4 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేశారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారు. సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు. అనుమతి లేని ఇంట్లో ఎందుకు ఉంటున్నారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి.
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉంటున్న సిగ్గు అనిపించడం లేదా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే అక్రమ ఇంటి నుంచి మారి ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా మారాలి. సుజనా చౌదరి కమల వనంలో ఉన్న పచ్చ పుష్పము..ఇంకా టీడీపీ నేతగానే సుజనా చౌదరి మాట్లాడుతున్నారు..
రివర్స్ టెండరింగ్‌లో వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా..? గతంలో మేఘ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్టులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.